ఏపీలో ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’
అమరావతి, 7 నవంబర్ (హి.స.) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంకు (Geo Rural Road Management System) అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అధికారులకు సూచించార
ఏపీలో ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’


అమరావతి, 7 నవంబర్ (హి.స.) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంకు (Geo Rural Road Management System) అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అధికారులకు సూచించారు.

అసలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రహదారులు ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి? అనే వివరాలు కూడా ప్రతి ఒక్కరికీ తెలియాలన్నారు. కొత్త రహదారి నిర్మిస్తే అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటలోకి రావాలని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని, రహదారులను మెరుగుపరచుకునేలా ఈ సాంకేతికత ఉండాలన్నారు. ఈ విధంగా జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంను త్వరితగతిన అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

పైలెట్ ప్రాజెక్టుగా అడవి తల్లి బాట అధునాతన సాంకేతికత సాయంతో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ వ్యవస్థకు రూపకల్పన చేయాలని డిప్యూటీ సీఎం అన్నారు. 48 గంటల్లో అందుకు సంబంధించి ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ (Action Plan) సిద్ధం కావాలన్నారు. ఒక వర్కింగ్ గ్రూప్ (Working Group) రూపొందించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందులో పొందుపరచాలన్నారు. ఈ అంశంలో అర్టీజీఎస్ (RTGS), ఇంజినీరింగ్ విభాగం అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని కోరారు. అడవి తల్లి బాటను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంచుకుని ఈ సిస్టంకు అనుసంధానించాలని సూచనలు చేశారు. తద్వారా ఎప్పటికప్పుడు గిరిజన గ్రామాల్లో (Agencies) పనుల పరోగతిని పరిశీలించే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏ పని చేసినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి అన్నదే తమ ఉద్దేశమని ప్రకటించారు.

పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తన ప్రతి అడుగూ ఆ దిశగానే ఉంటాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్, పల్లె పండగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండగ 2.0 (Palle Panduga 2.0), అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్వ పథకాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande