శ్రీచరణిని అభినందించిన మంత్రి నారా లోకేష్
అమరావతి, 7 నవంబర్ (హి.స.)ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ క్రికెట్ చాంపియన్ షిప్ (Cricket Championship) లో భారత టీం ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ఏపీకి చెందిన క్రీడాకారిణి శ్రీచరణి (Sricharani) కూడా భాగమయ్యారు. ఆమె మాజీ మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ
minister-nara-lokesh-congratulates-sricharani-491714


అమరావతి, 7 నవంబర్ (హి.స.)ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ క్రికెట్ చాంపియన్ షిప్ (Cricket Championship) లో భారత టీం ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ఏపీకి చెందిన క్రీడాకారిణి శ్రీచరణి (Sricharani) కూడా భాగమయ్యారు. ఆమె మాజీ మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu) కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ గెలిచినందుకు శ్రీచరణనిని ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచ వేదికపై భారత మహిళల సత్తాను చాటి చెప్పారని మంత్రి లోకేష్ అన్నారు. ఎంతో మంది యువ క్రీడాకారిణులకు శ్రీచరణి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ప్రపంచకప్ గెలుచుకున్న ఆనందకరమైన క్షణాలను, టోర్నీలోని అనుభవాలను శ్రీచరణి.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో పంచుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande