భాస్కర్.రెడ్డి.కి. 21 వంటిది వరకు 14 రోజుల రిమాండ్ విధించారు
విజయవాడ, 8 నవంబర్ (హి.స.) :సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కుటుంబసభ్యులు, మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ తదితరులపై సోషల్‌ మీడియా అనుచిత పోస్టుల కేసులో అరెస్టయిన మాలపాటి భాస్కర్‌రెడ్డిని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ కోర్టులో హాజ
భాస్కర్.రెడ్డి.కి. 21 వంటిది వరకు 14 రోజుల రిమాండ్ విధించారు


విజయవాడ, 8 నవంబర్ (హి.స.)

:సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కుటుంబసభ్యులు, మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ తదితరులపై సోషల్‌ మీడియా అనుచిత పోస్టుల కేసులో అరెస్టయిన మాలపాటి భాస్కర్‌రెడ్డిని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 10 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి ఆయనకు ఈనెల 21వ తేదీ వరకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం పోలీసులు భాస్కర్‌రెడ్డిని నెల్లూరు జైలుకు తరలించారు. గురువారం భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు.. స్థానిక స్టేషన్లో కాకుండా మరో చోట విచారించారు. తర్వాత పెనమలూరు స్టేషనుకు తరలించి ఎఫ్‌ఐఆర్‌ను పూర్తి చేశారు. రిమాండ్‌ నిమిత్తం శుక్రవారం మధ్యాహ్నం ఎస్కార్టు మధ్య విజయవాడ కోర్టుకు తీసుకెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande