
అమరావతి, 8 నవంబర్ (హి.స.)
కాకుమాను: రైతుల సమస్యలకు సాంకేతికంగా పరిష్కారాలు అందించే లక్ష్యంతో ఆర్‌వీఆర్ అండ్ జేసీ, సీఈఎస్‌టీపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ ఆధారిత సంస్థల సహకారంతో డిసెంబర్ 22, 23వ తేదీల్లో ‘నేషనల్ అగ్రిటెక్ హ్యాకథాన్-2025’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కళాశాల అధ్యక్షుడు డా. రాయపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జాగర్లమూడి మురళీమోహన్, డా. జగదీష్, కె.మద్దినేని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన యువత, ఆవిష్కర్తలు తమ సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘నేషనల్ అగ్రిటెక్ హ్యాకథాన్-2025’ పోస్టర్‌ను కళాశాల కార్యదర్శి, కరెస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ, కళాశాల సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ