పెన్షన్లు సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కులు.పంపిణీ.కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 48, ఎమ్మెల్యేల.పై.సీరియస్
అమరావతి, 8 నవంబర్ (హి.స.) సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 48 మంది ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. ప్రజలకు నేరుగా చేరుకునే ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనకపోవడం
పెన్షన్లు సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కులు.పంపిణీ.కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 48, ఎమ్మెల్యేల.పై.సీరియస్


అమరావతి, 8 నవంబర్ (హి.స.)

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 48 మంది ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. ప్రజలకు నేరుగా చేరుకునే ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, సంబంధిత ఎమ్మెల్యేలకు వెంటనే నోటీసులు ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రజలకు చేరువవుతూ, సంక్షేమ పథకాల అమలులో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొనడం తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు. నిర్వహణా వ్యవస్థ బలోపేతం కావాలంటే ప్రజాప్రతినిధులే ముందుండాలని, లేకపోతే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటుందని చంద్రబాబు పేర్కొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హాజరు కాని ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయబడనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande