
విశాఖపట్నం, 8 నవంబర్ (హి.స.)
, : క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన విశాఖ మహిళ 58 ఏళ్ల వయసులో సాహస యాత్ర చేశారు. ఎండాడకు చెందిన మున్నీ కైజరే అక్టోబరులో 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్టు బేస్ క్యాంపును అధిరోహించారు. ప్రతికూల వాతావర ణం, కఠిన పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా ట్రెక్కింగ్ పూర్తి చేసి, తిరిగి నగరానికి చేరుకున్నారు. ఆమె టింపనీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ