మద్యం.కుంభకోణం. కేసులో అరెస్టైన నిందితుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు పొడిగించింది
విజయవాడ, 8 నవంబర్ (హి.స.) , :మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి విజయవాడ, గుంటూరు జిల్లా జైళ్లలో ఉన్న ఖైదీలకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చ
మద్యం.కుంభకోణం. కేసులో అరెస్టైన నిందితుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు పొడిగించింది


విజయవాడ, 8 నవంబర్ (హి.స.)

, :మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి విజయవాడ, గుంటూరు జిల్లా జైళ్లలో ఉన్న ఖైదీలకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్‌ నాయుడు, బూనేటి చాణక్య, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న బాలాజీ కుమార్‌ యాదవ్‌, నవీన్‌ కృష్ణలను శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వారికి 21వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశాలు ఇచ్చారు. ఈ వాయిదాకు బెయిల్‌పై బయట ఉన్న నిందితులు ఎంపీ మిథున్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, కె.ధనంజయ్‌రెడ్డి, పైలా దిలీప్‌ హాజరయ్యారు. మరో నిందితుడు బాలాజీగోవిందప్ప తాను హాజరుకాలేనని పేర్కొంటూ మోమో దాఖలు చేశారు. సిట్‌ అధికారులు ఆరోపిస్తున్నట్టుగా తనకు ఏ డిస్టిలరీతో సంబంధం లేదని సజ్జల శ్రీధర్‌రెడ్డి న్యాయాధికారికి వివరించగా.. దీనిపై మోమో దాఖలు చేయాలని ఆయన ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande