
అమరావతి, 8 నవంబర్ (హి.స.)
:గూగుల్ మ్యాప్ సరికొత్త ఫీచర్స్‌ను జోడించనుంది. ఏఐ ఫీచర్ సహాయంతో గూగుల్ మ్యాప్‌ను అప్‌డేట్ చేసిన విషయం తెలిసిందే. గూగుల్ మ్యాప్స్‌లో ఇటీవల చేర్చిన సరికొత్త ఫీచర్‌లలో AI-ఆధారిత నావిగేషన్, EV ఛార్జింగ్ స్టేషన్ల సమాచారం, మెరుగైన ట్రాఫిక్ అలెర్ట్‌లు, స్థానిక నిపుణుల సిఫార్సులు వీక్షణ వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్‌లు యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడం వినియోగదారులకు మరింత సులభంగా ప్రయాణించడానికి సహాయపడతాయి. అయితే త్వరలో ఏపీఎస్ ఆర్ టీ సి అనుసంధానం కానుంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ