RTC ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై గూగుల్‌ మ్యాప్స్‌లో కూడా టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చు! ప్రాసెస్‌ ఇదే..
విజయవాడ, 8 నవంబర్ (హి.స.)సాధారణంగా మనం గూగుల్‌ మ్యాప్స్‌ను రూట్‌ తెలుసుకునేందుకు వాడుతుంటాం. అయితే ఇప్పుడు అందులోంచి టిక్కెట్‌ కూడా బుక్‌ చేసుకోవచ్చని తెలుసా? ఎస్‌.. ఇది నిజం. గూగుల్‌ మ్యాప్స్‌లో ఓ ప్లేస్‌ నుంచి మరో ప్లేస్‌కు వెళ్లేందుకు సెర్చ్‌ చే
Google Maps: Book APSRTC Bus Tickets Directly on google maps


విజయవాడ, 8 నవంబర్ (హి.స.)సాధారణంగా మనం గూగుల్‌ మ్యాప్స్‌ను రూట్‌ తెలుసుకునేందుకు వాడుతుంటాం. అయితే ఇప్పుడు అందులోంచి టిక్కెట్‌ కూడా బుక్‌ చేసుకోవచ్చని తెలుసా? ఎస్‌.. ఇది నిజం. గూగుల్‌ మ్యాప్స్‌లో ఓ ప్లేస్‌ నుంచి మరో ప్లేస్‌కు వెళ్లేందుకు సెర్చ్‌ చేస్తే.. ఆ రూట్‌లో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న బస్సుల వివరాలు కనిపిస్తాయి. అందులో మీకు కావాల్సిన బస్సును ఎంచుకొని టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ పలు వివరాలను గూగుల్‌కు అందజేసింది. ఇప్పటికే ఆర్టీసీలో బస్టాండ్లలోని కౌంటర్లు, ఏజెంట్లు, వెబ్‌సైట్, యాప్‌లో రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం ఉంది. ఇప్పుడు కొత్తగా గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా కూడా రిజర్వేషన్‌ చేసుకోవచ్చు.

ఎలా చేసుకోవాలి..?

గూగుల్‌ మ్యాప్స్‌లో విజయవాడ నుంచి హైదరాబాద్‌ అని టైప్‌ చేస్తే.. వీటి మధ్య దూరం ఎంత, బైక్, కారు, బస్, రైళ్లలో ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందనే వివరాలు జనరల్‌ ట్రాన్సిట్‌ స్పీడ్‌ స్పెసిఫికేషన్‌ (జీటీఎస్‌ఎఫ్‌) ద్వారా కనిపిస్తాయి. అందులో బస్‌ సింబల్‌ ఉన్నచోట క్లిక్‌ చేస్తే విజయవాడ నుంచి హైదరాబాద్‌కి ఎన్ని ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి, అవి ఏ సమయాల్లో బయలుదేరతాయి? ఎన్ని గంటల్లో చేరుకుంటాయనే వివరాలు కనిపిస్తాయి.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande