
అనంతరపురం, 8 నవంబర్ (హి.స.)ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బ్రేక్ ఫెయిల్ (Break Fail) అయ్యి రాయిని ఢీకొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే అనంతపురం (Ananthapuram) జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సులో విద్యార్థులను ఎక్కించుకొని డ్రైవర్ బయలుదేరాడు. తూముచెర్ల-తగరకుంట (Tumucherla-Tagarakunta) మధ్య మార్గంలో ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అయినట్లు తెలిసింది. దీంతో బస్సు అదుపు తప్పి రహదారి పక్కనున్న ఓ రాయిని ఢీకొట్టింది.
ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది. అయితే బస్సులో ఉన్న విద్యార్థులకు, డ్రైవరుకు మాత్రం ఏం కాలేదు. ప్రాణాపాయం లేకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులకు పెను ప్రమాదం తప్పిందని అనుకున్నారు. ఘటన జరిగిన సమయంలో 60 మంది విద్యార్థులు (Students) ఉన్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV