ఏపీలో పెళ్లి కారు బీభత్సం.. ముగ్గురు స్పాట్‌డెడ్
కిర్లంపూడి,, 8 నవంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై దూసుకె
న


కిర్లంపూడి,, 8 నవంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది.

బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై దూసుకెళ్ళింది. అన్నవరంలో పెళ్లి ముగించుకుని జగ్గంపేట తిరిగే వెళ్తుండగా కారు ఫ్రంట్ టైర్ పేలి పోవడంతో రెండు మోటర్ సైకిల్ ను ఒక రిక్షాను కారు వేగంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిలో ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. గాయలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande