కేరళ ముఖ్యమంత్రి నివాసానికి బాంబు బెదిరింపు..
తిరువనంతపురం, 1 డిసెంబర్ (హి.స.) కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బాంబు నివాసాన్ని పేల్చి వేస్తామని దుండగులు బెదిరింపు చేసినట్లు సమాచారం. తిరువనంతపురంలోకి ఆయన ఇల్లు క్లిఫ్ హౌస్ కు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో అక
కేరళ సీఎం


తిరువనంతపురం, 1 డిసెంబర్ (హి.స.)

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బాంబు నివాసాన్ని పేల్చి వేస్తామని దుండగులు బెదిరింపు చేసినట్లు సమాచారం. తిరువనంతపురంలోకి ఆయన ఇల్లు క్లిఫ్ హౌస్ కు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.

బాంబు అలాగే ప్రభుత్వ సచివాలయం సమీపంలోని స్పెన్సర్ జంక్షన్లోని సౌత్ ఇండియన్ బ్యాంక్ రెండు శాఖలకు, రాజధానిలోని తంపనూర్లో ఉన్న సౌత్ ఇండియన్ బ్యాంక్ శాఖలకు కూడా బాంబు బెదిరింపు మెసేజ్ లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని, ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరై కనుగొని, అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. డిసెంబర్ 3న జరగనున్న భారత నౌకాదళ దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననుండగా.. రెండ్రోజుల ముందే సీఎం నివాసానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande