డేంజర్‌ బెల్స్‌.. సిగరెట్ తాగకపోయినా లంగ్‌ క్యాన్సర్‌.. దడపుట్టిస్తున్న వాయు కాలుష్యం..
ఢిల్లీ, 1 డిసెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీకి ఊపిరి ఆడడం లేదు.. వాయు కాలుష్యం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.. ఢిల్లీలో గాలి నాణ్యత వెరీ పూర్‌ కేటగిరిలోనే రికార్డ్‌ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్‌ మొత్తం గాలి కాలుష్యం డేంజర్‌ బెల్స్‌ మోగించగా
Delhi Air Pollution: Lung Cancer Threat for Non Smokers, Adenocarcino


ఢిల్లీ, 1 డిసెంబర్ (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీకి ఊపిరి ఆడడం లేదు.. వాయు కాలుష్యం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.. ఢిల్లీలో గాలి నాణ్యత వెరీ పూర్‌ కేటగిరిలోనే రికార్డ్‌ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్‌ మొత్తం గాలి కాలుష్యం డేంజర్‌ బెల్స్‌ మోగించగా.. ఇప్పుడు మరో వారం రోజులపాటు ఇవే పరిస్థితులు కంటిన్యూ అయ్యే చాన్స్‌ ఉందని వెదర్‌ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. అయితే.. ఇప్పటికే వాయుకాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ ప్రజలను పెరుగుతున్న కేన్సర్‌ కేసులు మరింత దడ పుట్టిస్తున్నాయి.

అడినోకార్సినోమా అనే లంగ్‌ క్యాన్సర్ బారిన ఢిల్లీ వాసులు

ఢిల్లీ వాసుల్లో అడినోకార్సినోమా అనే ఉపిరితిత్తుల క్యాన్సర్ రకం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ధూమపానం అలవాటు లేని వారిలోనూ ఈ కేసులు పెరుగుతుండడం షాకిస్తోంది. సాధారణంగా సిగరెట్‌తోపాటు.. ఇతర దుర అలవాట్ల ద్వారా అధికంగా సంభవించే లంగ్ క్యాన్సర్ కేసులు.. ఇప్పుడు ఆ అలవాటు లేనివారిని కూడా ఎటాక్‌ చేస్తున్నట్లు సర్వేల్లో వెల్లడవుతోంది. 1998లో లంగ్ క్యాన్సర్ కేసులు 90 శాతం దాదాపు సిగరెట్ అలవాటు ఉన్నవారికే వచ్చేవని అప్పటి సర్వేల్లో తేలింది. కానీ.. 2018లో క్యాన్సర్ కేసులు నమోదైనవారిలో దాదాపు 60 నుంచి 70శాతం మంది ధూమపానం అలవాటు లేని వారేనని స్పష్టం చేసింది. గడిచిన దశాబ్దాల కాలంలో గాలినాణ్యత పూర్తిగా క్షీణించడంతోనే ఈ రకమైన లంగ్‌ క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. ఈ ఏడాది ది లాన్సెంట్ నిర్వహించిన అధ్యయనంలోనూ షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. గాలిలో నాణ్యత క్షీణించడం వల్లే అడినోకార్సినోమా అనే క్యాన్సర్ రకం కేసులు అధికంగా పెరుగుతాయని సర్వేలో వెల్లడించింది.

గాలి కాలుష్యమే క్యాన్సర్‌కు ప్రధాన కారణం

ఇక.. ఢిల్లీలోని గాలి కాలుష్యమే అడినోకార్సినోమా క్యాన్సర్‌కు ప్రధాన కారణమని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. యువకులు, మహిళల్లో ఈ రకం కేసులు ఎక్కువగా రికార్డ్‌ అవుతున్నాయని చెప్తున్నారు. అయితే.. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించి.. క్యాన్సర్‌కు దారి తీస్తున్న పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించి.. తగిన నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఢిల్లీలో ఎయిర్‌ పొల్యూషన్‌కు చెక్‌ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇటీవలే సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో.. వాయు కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande