
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ ,1 డిసెంబర్ (హి.స.)కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సీఎం వ్యక్తిగత కార్యదర్శితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్‌కు ఈ నోటీసులు అందాయి. 2019లో మసాలా బాండ్ జారీలో విదేశీ మారకపు నిర్వహణ చట్టాన్ని (FEMA) ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ నోటీసులు జారీ అయ్యాయి (Pinarayi Vijayan).
2019లో కేరళ రాష్ట్రం మసాలా బాండ్లను జారీచేసింది. ఆ తరహా బాండ్లను జారీ చేసిన తొలి రాష్ట్రం కేరళనే (Kerala). భారత సంస్థలు విదేశాల్లో స్థానిక కరెన్సీలో కాకుండా భారత కరెన్సీలో వీటిని జారీ చేశాయి. దేశీయంగా వృద్ధికి దోహదపడేలా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించడం, రూపాయి అంతర్జాతీయీకరణ వీటి ఉద్దేశం. ఈ బాండ్ల ద్వారా కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్ (KIIFB) రూ.2వేల కోట్లమేర సమీకరించింది. తర్వాత అవి లండన్ ఎక్స్చేంజీకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఆ మొత్తం విలువ రూ.2,150 కోట్లకు పెరిగింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు