
మహారాష్ట్ర, 1 డిసెంబర్ (హి.స.)
మహిళలను ఉద్దేశించి మహారాష్ట్ర మంత్రి జయకుమార్ గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో భర్తలు అవసరాలకు రూ.100 కూడా ఇవ్వరని.. అలాంటిది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివిస్.. లడ్కీ బహిన్ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 స్టైఫండ్ ఇస్తున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి మహిళ ఫడ్నవిస్కు కృతజ్ఞతగా బీజేపీకి ఓటువేసి విధేయత చూపించాలని కోరారు. ఓటు వేసేటప్పుడు ఫడ్నవీస్ ప్రభుత్వం చేసిన సహాయాన్ని గుర్తుంచుకోవాలని మహిళా ఓటర్లను కోరారు.
డిసెంబర్ 2న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షోలాపూర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయకుమార్ గోర్ మాట్లాడుతూ... స్థానిక ఎన్నికల సమయంలో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి.. కానీ ప్రతి నెల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే రూ. 1,500 స్టైఫండ్ను గుర్తుంచుకోవాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు