డిసెంబర్ 4న కనువిందు చేయనున్న మరో సూపర్ మూన్
హైదరాబాద్, 1 డిసెంబర్ (హి.స.) 2025లో ఆకాశంలో మొత్తం 8 సూపర్ మూన్స్ కనిపించగా.. వరుసగా అక్టోబర్, నవంబర్ నెలల్లో సూపర్ మూన్స్ కనువిందు చేశాయి. ఇప్పుడు డిసెంబర్లోనూ మరో సూపర్ మూన్ కనిపించనుంది. సూపర్ మూన్ అంటే చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినపుడు చంద్
సూపర్ మూన్


హైదరాబాద్, 1 డిసెంబర్ (హి.స.)

2025లో ఆకాశంలో మొత్తం 8 సూపర్ మూన్స్ కనిపించగా.. వరుసగా అక్టోబర్, నవంబర్ నెలల్లో సూపర్ మూన్స్ కనువిందు చేశాయి. ఇప్పుడు డిసెంబర్లోనూ మరో సూపర్ మూన్ కనిపించనుంది. సూపర్ మూన్ అంటే చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినపుడు చంద్రుడి ప్రతిబింబం కాస్త పెద్దదిగా కనిపిస్తుంది. 2025లో డిసెంబర్ 4న ఆఖరి సూపర్ మూన్ ఆకాశంలో కనువిందు చేయనుంది.

ఈనెల 4న కనిపించనున్నది అసలైన సూపర్ మూన్. చంద్రుడు తన కక్ష్యలో భూమికి అతి దగ్గరగా పౌర్ణమి తిథిలో చేరినపుడు ఇది కనిపిస్తుంది. దీనిని జ్యోతిష్యం పరంగా వ్యక్తిగత అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. ముఖ్యంగా సాయంత్రం వేళ చంద్రోదయం సమయంలో చాలా పెద్దగా కనిపిస్తాడు. దీనిని మూన్ ఇల్యూషన్ అని చెప్తుంటారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande