
హైదరాబాద్, 1 డిసెంబర్ (హి.స.)
గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025 ను ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ఆరు నెలల గడువు నిర్ణయించారు. అయితే ఈ గడువు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ఈ రోజు విచారించిన కోర్టు.. వారి వాదనను తోసిపుచ్చింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం, దరఖాస్తుదారులు తమ రిలీఫ్ కోసం 2025 చట్టం ప్రకారం నేరుగా వక్ఫ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని సూచించింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..