కేంద్ర సర్కార్ షాకింగ్ నిర్ణయం.. పొగాకు, పాన్ మసాలాలపై భారీగా పన్ను..
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
కేంద్ర సర్కార్ షాకింగ్ నిర్ణయం.. పొగాకు, పాన్ మసాలాలపై భారీగా పన్ను..


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ ,1 డిసెంబర్ (హి.స.)కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దేశంలో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా లాంటి ఉత్పత్తులపై అమలులో ఉన్న పన్ను విధానాన్ని మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో రెండు ప్రధాన బిల్లులను ప్రవేశ పెట్టడానికి రెడీ అయింది. మొదటి బిల్లు ‘హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025’, రెండోది సెంట్రల్ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లులను పెట్టనుంది. ఈ రెండు బిల్లులు ప్రస్తుతం అమలులో ఉన్న GST పరిహార సెస్సును తొలగించి, కొత్త పేరుతో కానీ అదే నిర్మాణంతో పన్నుల వసూళ్లను కొనసాగిస్తుంది.

అయితే, ప్రస్తుతం సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి ఉత్పత్తులు GSTతో పాటు ‘కంపెన్సేషన్ సెస్సు’ కింద ట్యాక్స్ కడుతున్నాయి. ఈ సెస్సు త్వరలో ముగియనుంది. దీంతో ప్రభుత్వం ఆదాయ నష్టాన్ని నివారించుకోవడానికి అదే సెస్సును కొత్త చట్టంలో కొనసాగించాలని ప్లాన్ చేస్తుంది. ఈ మార్పు పన్ను వసూళ్లను మరింత ఈజీగా చేయడంతో పాటు సంస్థాగత పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక, సామాన్య ప్రజలకు ధరల పెరుగుదల ప్రస్తుతానికి కనిపించదు, పన్ను రేట్లు మారడం లేదంటున్నారు నిపుణులు. అయితే, కంపెనీలకు మాత్రం రిపోర్టింగ్ విధానాలు, అకౌంటింగ్ ప్రక్రియలు, పన్ను కంప్లయన్స్ లో మార్పులు వచ్చే ఛాన్స్ మాత్రం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande