తమిళనాట భారీ వర్షాలు.. ఆరుగురి మృతి
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} చెన్నై,/ఢిల్లీ ,1 డిస
cyclone montha


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

చెన్నై,/ఢిల్లీ ,1 డిసెంబర్ (హి.స.) : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో తమిళనాడులోని తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. తంజావూరు, తిరువారూర్‌, మైలాడుదురై, నాగపట్టణం తదితర డెల్టా జిల్లాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తుండడంతో వేలాది ఎకరాల పంట నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా ప్రమాదాలబారిన పడి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆరుగురు మృతి చెందారు. రామనాథపురం జిల్లా రామేశ్వరంలో శని, ఆదివారాల్లో అతి భారీ వర్షం కురిసింది. రామేశ్వరం రైల్వే స్టేషన్‌ నీట మునిగింది. రైల్వే ప్లాట్‌ఫారాలపైకి వర్షపునీరు చొచ్చుకువచ్చింది. వందలాది గృహాలు వరదనీటిలో తేలియాడుతున్నాయి. తంజావూరు, తిరువారూర్‌, నాగపట్టణం, మైలాడుదురై జిల్లాల్లో 100కుపైగా గృహాలు కూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా తంజావూరుతో సహా నాలుగు జిల్లాలకు చెందిన జాలర్లు వారం రోజులుగా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లలేదు. దీంతో 60 వేలకుపైగా జాలర్లు ఉపాధిని కోల్పోయారు. కన్యాకుమారిలో సముద్రపు నీరు వందడుగుల మేర వెనక్కి వెళ్లింది. దీంతో సముద్రగర్భంలోని పెద్దపెద్ద రాళ్లు బయటపడ్డాయి. ఇక దిత్వా తుఫాను కారణంగా చెన్నై, కడలూ

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande