విపక్షాల ఆందోళన.. లోక్‌సభ మళ్లీ వాయిదా
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Garamond;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
Lok Sabha


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Garamond;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ ,1 డిసెంబర్ (హి.స.)లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం ఉదయం 12.00 గంటలకు మళ్లీ ప్రారంభమైన సభలో విపక్ష సభ్యులు.. తమ పట్టు వీడలేదు. సర్ (SIR), ఢిల్లీ బాంబు పేలుళ్లు, ఢిల్లీలో కాలుష్యం తదితర అంశాలపై చర్చ జరగాల్సిందేనంటూ వారంతా పట్టు పట్టారు. దీంతో మధ్యాహ్నం 2.00 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ రోజు ఉదయం 11.00 గంటలకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ప్రారంభం కావడంతో.. రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసగించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు జరుగుతుందంటూ స్పీకర్ ప్రకటించారు.

కానీ ముందుగా తాము ప్రతిపాదించిన సమస్యలపై చర్చ జరగాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నమని స్పీకర్ ఓం బిర్లా విపక్షాలకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రశ్నోత్తరాలకు సహకరించాలంటూ విపక్షాలకు ఆయన స్పష్టం చేశారు. కానీ విపక్ష సభ్యులు మాత్రం ముందుగా తాము ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీంతో విపక్ష ఎంపీల తీరుతో స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం చెందారు. ఈ సభను మధ్యాహ్నం 12.00 గంటకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో సైతం విపక్ష ఎంపీ తీరు అదే విధంగా ఉండడంతో.. తిరిగి సభను మధ్యాహ్నం 2.00 గంటలకు మరోసారి స్పీకర్ వాయిదా వేశారు.

9

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande