
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ ,1 డిసెంబర్ (హి.స.)దేశాభివృద్ధి కోసం విపక్షాలు ప్రభుత్వంతో కలిసి రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. పరాజయాన్ని అంగీకరించే మనసు ప్రతిపక్షాలకు లేదని దుయ్యబట్టారు. సభా సమయాల్లో డ్రామాలు వద్దని, చట్టసభల్లో చర్చలు తప్పనిసరని హితవు పలికారు (Parliament Winter Session). సోమవారం శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని (PM Modi) మీడియాతో మాట్లాడారు.
‘‘ఈ పార్లమెంట్ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నాను. దేశ ప్రగతి కోసం మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని చట్టసభ సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి. కొత్త ఎంపీలకు స్ఫూర్తి కలిగించేలా మన ప్రవర్తన ఉండాలి. చట్టసభల్లో డ్రామాలు వద్దు. సానుకూల వాతావరణంలో చర్చలు జరగాలి. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగలవద్దని కోరుతున్నాను. విపక్షాలు ఓటమి నిరాశను అధిగమించాలి. అవి తమ బాధ్యతను నిర్వర్తించాలి. బలమైన అంశాలను లేవనెత్తాలి’’ అని మోదీ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు