పాకిస్తాన్‌కు వార్నింగ్.. “ఆపరేషన్ సిందూర్‌”పై నేవీ చీఫ్ కీలక వ్యాఖ్యలు.
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
పాకిస్తాన్‌కు వార్నింగ్.. “ఆపరేషన్ సిందూర్‌”పై నేవీ చీఫ్ కీలక వ్యాఖ్యలు.


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ ,1 డిసెంబర్ (హి.స.)పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో భీకరదాడులు చేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలతో పాటు ఆ దేశ ఎయిర్ ఫోర్స్ బేసుల్ని ధ్వంసం చేసింది. ఇదిలా ఉంటే, దయాది దేశం మళ్లీ తోక జాడిస్తే మళ్లీ దాడులు చేస్తామని ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పలువురు సైన్యాధికారులు వార్నింగ్ ఇచ్చారు. తాజాగా, భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి పాక్‌కి హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇప్పటికీ కొనసాగుతోందని అన్నారు. మహారాష్ట్ర పూణేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ కు అంకితం చేసిన ఇండియన్ నేవీ మారిటైమ్ మ్యూజియం శంకుస్థాపనలో ఆయన వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నేవీ వేగంగా మోహరించిందని, దీంతో పాకిస్తాన్ నేవీ కేవలం హార్బర్‌కు మాత్రమే పరిమితమైందని చెప్పారు. ప్రపంచ సముద్రాలు కఠినంగా ఉన్నప్పుడు ప్రపంచం స్థిరమైన లైట్ హౌజ్ కోసం చూస్తుందని, బాధ్యతాయుతమైన భారతదేశం ప్రపంచ వేదికపై ఆ పాత్ర పోషించగలదని ఆయన పేర్కొన్నారు. పహల్గామ్ దాడి తర్వాత కేవలం 96 గంటల్లోనే నేవీని మోహరించామని,దీంతో పాకిస్తాన్ ఒత్తిడికి గురైందని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande