సీపీ.రాధాకృష్ణన్ ప్రజా సేవకే జీవితం అంకితం చేశారు.. చైర్మన్‌ను అభినందించిన మోడీ
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
C P Radhakrishnan


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ ,1 డిసెంబర్ (హి.స.)పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇక రాజ్యసభకు తొలిసారి సీపీ రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా అన్ని పార్టీలు ఆయన్ను అభినందించాయి. ఇక ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా మహిళలకు మోడీ అభినందనలు తెలిపారు. ‘‘పెద్దల సభా గౌరవాన్ని సభ్యులు గౌరవించాలి. సీపీ.రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. రాధాకృష్ణన్ ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్ గవర్నర్‌గా పని చేశారు. అర్థవంతమైన చర్చలు జరిగితే సభకు సార్థకత వస్తుంది.’’ అని మోడీ తెలిపారు.

గత వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున అనూహ్యంగా ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేశారు. దీంతో ఆయన వారసుడిగా మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీసీ.రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిగా కేంద్రం ఎన్నిక చేసింది. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున రాజ్యసభ ఛైర్మన్‌గా రాధాకృష్ణన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అందరూ ఆయన్ను అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande