
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ముంబయి/ఢిల్లీ ,1 డిసెంబర్ (హి.స.): దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని ఉత్సాహంగా ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత అంచనాలు, దేశీయంగా కొనుగోళ్ల అండతో బుల్ దూసుకెళ్తోంది. దీంతో సూచీలు (Stock Market) కొత్త రికార్డుల్లో పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ 86వేల మార్క్ దాటగా.. నిఫ్టీ 26,300 పైన కదలాడుతోంది.
ఉదయం 9.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ (Sensex) 383 పాయింట్లు ఎగబాకి 86,089 వద్ద నిఫ్టీ (Nifty) 108 పాయింట్ల లాభంతో 26,311 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో ఎస్‌బీఐ, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ రాణిస్తుండగా.. టెక్ మహీంద్రా, టాటా కన్జూమర్, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్ ఒత్తిడికి గురవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 60వేల మార్క్ దాటింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 89.46 వద్ద కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు