
ఢిల్లీ 12డిసెంబర్ (హి.స.)
చైనా వృత్తి నిపుణులకు సాధ్యమైనంత వేగంగా బిజినెస్ వీసాలు ఇచ్చేలా భారత ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యేందుకు ఇది కీలక అడుగు కానుంది. సంబంధిత అధికారులు వెల్లడించిన వివరాలను బట్టి జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ సడలింపుల వల్ల వీసా జాప్యాలు ఉండవని, దాంతో వ్యాపారాలకు నిపుణుల కొరత లేకుండా చూసుకోవచ్చని వెల్లడించాయి. వీసా ఆమోద సమయాన్ని నాలుగు వారాల్లోపునకు కుదించడంతో పాటు కొన్ని పరిశీలన స్థాయిల్ని తొలగించారని అధికారులు వెల్లడించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ