నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పొగమంచు.. పదుల సంఖ్యలో వాహనాలు ఢీ
ఢిల్లీ 13,డిసెంబర్ (హి.స.)దిల్లీ: ఉత్తరాదిలో వాయు కాలుష్యం (Air pollution) తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యతా సూచీ (AQI) ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. శనివారం తెల్లవారుజామున నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పొగమంచు (Dense Fog) దట్టంగా కమ్ముకోవడంతో పదుల స
Air pollution in the state has increased,


ఢిల్లీ 13,డిసెంబర్ (హి.స.)దిల్లీ: ఉత్తరాదిలో వాయు కాలుష్యం (Air pollution) తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యతా సూచీ (AQI) ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. శనివారం తెల్లవారుజామున నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పొగమంచు (Dense Fog) దట్టంగా కమ్ముకోవడంతో పదుల సంఖ్యలో వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి (Multiple Vehicles Collide On Noida Expressway). ఈ ప్రమాదంలో వాహనదారులకు గాయాలవడంతో.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హైవేపై భారీగా నిలిచిపోయిన వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలంలోని దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande