కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీకి చారిత్రక విజయం
తిరువనంతపురం, 13 డిసెంబర్ (హి.స.) కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో, తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ (NDA) చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 101 వార్డులకు గాను, బీజేపీ కూటమి 50 వార్డులను కైవసం చేసుకుని, మేయర్ పీఠాన్ని దక్క
కేరళ బిజెపి


తిరువనంతపురం, 13 డిసెంబర్ (హి.స.)

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో, తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ (NDA) చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 101 వార్డులకు గాను, బీజేపీ కూటమి 50 వార్డులను కైవసం చేసుకుని, మేయర్ పీఠాన్ని దక్కించుకునే దిశగా దూసుకెళ్లింది. గతంలో ఈ కార్పొరేషన్ సుదీర్ఘ కాలం పాటు పాలక పక్షమైన ఎల్డీఎఫ్ (LDF) ఆధీనంలో ఉండేది. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 29 వార్డులకే పరిమితమైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) 19 వార్డులను గెలుచుకుంది. రాజధాని నగరంలో తమదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ విజయం ఒక పెద్ద మైలురాయిగా మారింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande