
ఢిల్లీ 13,డిసెంబర్ (హి.స.) దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం (Delhi Air Pollution) సమస్య తీవ్రమైంది. శీతాకాలం కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. తాజాగా వాయు నాణ్యత సూచీ (AQI) 387గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) వెల్లడించింది. శనివారం తెల్లవారుజామున నగరంలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పివేయడంతో దృశ్యగోచరత తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు సాధారణంగానే కొనసాగుతున్నాయని.. విమానాల సమయాల్లో మార్పులను తెలుసుకోవడానికి ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ