జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బిహార్‌ మంత్రి నితిన్‌ నబీన్‌
డిల్లీ, 14 డిసెంబర్ (హి.స.)భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బిహార్‌ మంత్రి నితిన్‌ నబీన్‌ (Nitin Nabin) నియమితులయ్యారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సి
Nabin


డిల్లీ, 14 డిసెంబర్ (హి.స.)భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బిహార్‌ మంత్రి నితిన్‌ నబీన్‌ (Nitin Nabin) నియమితులయ్యారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

బిహార్‌లోని బాంకీపుర్‌ అసెంబ్లీ స్థానం నుంచి నితిన్‌ నబీన్‌ వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రహదారుల నిర్మాణశాఖ మంత్రిగా ఉన్నారు. భాజపా ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2020 జనవరిలో ఈ పదవిలో నియమితులయ్యారు. ఇప్పటికే ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ.. పొడిగించారు.

ప్రధాని మోదీ శుభాకాంక్షలు

నితిన్ నబీన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కష్టపడి పనిచేసే కార్యకర్తగా నితిన్ నబీన్ గుర్తింపు పొందారు. ఆయనకు సంస్థాగతంగా గొప్ప అనుభవం ఉంది. బిహార్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా అద్భుతమైన రికార్డు ఆయన సొంతం. ఆయన పనితీరు రాబోయే కాలంలో భాజపాను మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande