
ఢిల్లీ 14,డిసెంబర్ (హి.స.) , కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కొత్త చీఫ్‌గా న్యాయ శాఖ మాజీ కార్యదర్శి, 1990 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ గోయల్ నియమితులయ్యారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మందిని కమిషనర్లుగా ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరిలో సీనియర్ జర్నలిస్టులు పీఆర్ రమేశ్, అశుతోష్ చతుర్వేది, రైల్వే బోర్డు మాజీ చైర్‌పర్సన్ జయవర్మ సిన్హా, సామాజిక న్యాయం, సాధికారత మాజీ కార్యదర్శి సురేంద్ర సింగ్ మీనా, మాజీ ఐపీఎస్ అధికారి స్వాగత్ దాస్, మాజీ ఐఎ్‌ఫఎస్ అధికారి కుశ్వంత్ సింగ్ సేథి, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) సభ్యురాలైన (లీగల్) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి రేలంగి, రిటైర్డ్ ఐఏఎస్ సంజీవ్ కుమార్ జిందాల్ ఉన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫారసులు చేసిందని అధికారులు శనివారం వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ