మెస్సి ఈవెంట్‌ నిర్వాహకుడు శతద్రు దత్తాకు నో బెయిల్‌
కోల్‌కతా,14 డిసెంబర్ (హి.స.) అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి (Lionel Messi) పర్యటన వేళ కోల్‌కతా స్టేడియంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అరెస్టయిన ఈవెంట్‌ నిర్వాహకుడు శతద్రు దత్తా (Satadru Dutta)కు బెయిల్‌ లభించ
LIONEL MESSI & V. Abdurahiman


కోల్‌కతా,14 డిసెంబర్ (హి.స.) అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి (Lionel Messi) పర్యటన వేళ కోల్‌కతా స్టేడియంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అరెస్టయిన ఈవెంట్‌ నిర్వాహకుడు శతద్రు దత్తా (Satadru Dutta)కు బెయిల్‌ లభించలేదు. అతడిని పోలీసులు 14రోజులు కస్టడీకి తీసుకున్నారు.

‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’లో భాగంగా మెస్సి తొలుత కోల్‌కతాకు వెళ్లాడు. అక్కడి సాల్ట్‌లేక్‌ స్టేడియంలో చెప్పినదాని కంటే తక్కువ సమయం గడపడంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో స్టేడియంలో సీసాలు, ప్లాస్టిక్‌ కుర్చీలను మైదానంలోకి విసిరేశారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఈవెంట్‌ నిర్వాహకుడు శతద్రును పోలీసులు ఎయిర్‌పోర్టులో అరెస్టుచేశారు. ఈవెంట్‌ను సరిగా నిర్వహించకుండా గందరగోళానికి కారణమయ్యాడన్నది అతడిపై ఆరోపణ.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande