
ఢిల్లీ, 14 డిసెంబర్ (హి.స.)
అఫ్గానిస్తాన్ హెల్త్ మినిస్టర్ మాలావీ నూర్ జలాల్ జలాలీ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్నారు. భారత్, అఫ్గాన్ మధ్య వైద్య రంగంలో కూడా సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. డిసెంబరు 17న ఆయన భారత్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత మూడు నెలల్లో తాలిబన్ మంత్రులు భారత్‌కు రావడం ఇది మూడోసారి. అంతకుముందు అఫ్గానిస్తాన్ విదేశాంగ శాఖ, వాణిజ్య శాఖ మంత్రులు న్యూఢిల్లీకి వచ్చారు. ఇరుదేశాల మధ్య ఆరోగ్య రంగంలో భాగస్వామ్యం పెరుగుతున్న వేళ.. అఫ్గాన్ ఆరోగ్యమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV