కరీంనగర్ లో బీజేపీ వినూత్న నిరసన..
కరీంనగర్ , 15 డిసెంబర్ (హి.స.) జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు నేడు వినూత్న నిరసన చేపట్టారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పేరుతో అభివృద్ధి చేయాల్సిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు దయనీయ స్థితిలో ఉన్నాయని ఆరోపిస్తూ ఏకంగా రోడ్డుపై పొర్లు దండాలు పెట్టి వారు
బిజెపి నిరసన


కరీంనగర్ , 15 డిసెంబర్ (హి.స.)

జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు నేడు వినూత్న నిరసన చేపట్టారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పేరుతో అభివృద్ధి చేయాల్సిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు దయనీయ స్థితిలో ఉన్నాయని ఆరోపిస్తూ ఏకంగా రోడ్డుపై పొర్లు దండాలు పెట్టి వారు నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్మార్ట్ సిటీ పథకం కింద కరీంనగర్లో అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పేరిట ఇస్టారీతిగా పనులు చేస్తున్నారు.. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిసాన్నగర్లో రోడ్లు, డ్రైనేజీ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని తెలిపారు. ఎన్ని సార్లు సమస్యను అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ బీజేపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. కిసాన్ నగర్లో రోడ్లు, డ్రైనేజీ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వానికి పొర్లు దండాలు పెట్టారు. ఇప్పటికైనా సమస్యలను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని బిజెపి నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande