అన్నవరం సత్యనారాయణ స్వామి మెట్లోత్సవం ఘనంగా జరిగింది
అన్నవరం, 16 డిసెంబర్ (హి.స.) , : అన్నవరం సత్యనారాయణ స్వామి మెట్లోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా స్వామి, అమ్మవార్లు పల్లకీ వెంట భక్తులు మెట్టు మెట్టుకు పూజ చేస్తూ కొండపైకి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 8 గంటలక
అన్నవరం సత్యనారాయణ స్వామి మెట్లోత్సవం ఘనంగా జరిగింది


అన్నవరం, 16 డిసెంబర్ (హి.స.)

, : అన్నవరం సత్యనారాయణ స్వామి మెట్లోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా స్వామి, అమ్మవార్లు పల్లకీ వెంట భక్తులు మెట్టు మెట్టుకు పూజ చేస్తూ కొండపైకి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 8 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో కొండపై నుంచి దిగువకు తెచ్చారు. గ్రామోత్సవం అనంతరం ఉదయం 9 గంటలకు తొలి పావంచాల వద్ద వైదిక బృందం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. 9.30 గంటలకు ఛైర్మన్‌ ఐ.వి.రోహిత్, ఈవో వి.త్రినాథరావులు తొలిమెట్టు వద్ద హారతి వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు మెట్టుమెట్టుకు పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించి, నైవేద్యం సమర్పించి కర్పూర హారతి వెలిగిస్తూ పూజలు చేశారు. మహిళలు స్వామి నామస్మరణతో.. వేదమంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాల నడుమ కొండపైకి చేరుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande