
అమరావతి, 16 డిసెంబర్ (హి.స.)
ఈనాడు డిజిటల్, భీమవరం, నరసాపురం, పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వందేభారత్ కల సాకారమైంది. షెడ్యూల్ ప్రకారం.. విజయవాడ నుంచి సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు నరసాపురం స్టేషన్‌కు చేరుకుంది. స్థానిక రైల్వే సిబ్బంది పూల దండలు, బెలూన్లతో సుందరంగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం 2.45కి రైల్వే, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ బ్రాంచ్ లైన్‌లో నడిచే మొదటి వందేభారత్ సర్వీసుగా ఇది భారతీయ రైల్వేలో నిలుస్తుందన్నారు. నరసాపురం, భీమవరం, పాలకొల్లు, ఆకివీడు, గుడివాడ ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారని, మరిన్ని రైళ్ల రాకపోకల అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, పులపర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, వెనిగండ్ల రాము (గుడివాడ), ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, రాష్ట్ర మహిళా ఆర్థిక కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పీతల సుజాత, మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు షరీఫ్, మాజీ ఎంపీ కనుమూరు బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాశ్, విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనకియా, అధికారులు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ