
హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.) డాలర్తో పోలిస్తే చరిత్రలో ఆల్టైమ్
కనిష్టానికి రూపాయి (Rupee) విలువ పడిపోయింది. నేటి ఇంట్రాడే(Intraday)లో రూపాయి విలువు రూ.90.75 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది గత వారం నమోదైన 90.55, 90.56 స్థాయిలను మించి అత్యంత కనిష్టానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా (America-భారత్ (India) వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడంతో పాటు విదేశీ పెట్టుబడుల భారీ ఉపసంహరణలు, వాణిజ్య లోటు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు