
హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.)
రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా
శాంతి వనాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. శాంతి వనాన్ని సందర్శించిన అనంతరం దాజీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కన్హా శాంతి వనంలో హార్ట్ ఫుల్నెస్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను గురించి చర్చించారు. శాంతి వనంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం, ధ్యానం, యోగా శిక్షణపై దాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు వివిధ అంశాలను వివరించారు. ఏపీలో హార్ట్ ఫుల్నెస్ కార్యాలయం ఏర్పాటు చేయడంపై దాజీతో సీఎం సమాలోచనలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు