
జోగులాంబ గద్వాల, 15 డిసెంబర్ (హి.స.)
గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్ తో కలిసి మూడో విడత పోలింగ్ సిబ్బందికి మూడవ విడత ర్యాండమైజేషన్ను విజయవంతంగా పూర్తిచేశామని, డిసెంబర్ 17న ఎన్నికలు జరిగే జిల్లాలోని అలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, ఎర్రవల్లి మండలాల్లో మొత్తం 700 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఏకగ్రీవాల అనంతరం మిగిలిన 638 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు