లోక్సభలో వైసీపీకి.కేశినేని కౌంటర్
అమరావతి, 15 డిసెంబర్ (హి.స.) లోక్‌సభలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సప్లిమెంటరీ డిమాండ్స్ ఫ‌ర్ గ్రాంట్స్‌పై ఎంపీ కేశినేని శివనాథ్ ప్రసంగించారు. అనుబంధ నిధుల కోసం 72 గ్రాంట్లపై జ‌రిగిన చర్చలో రూ. 1.32 లక్షల కోట్ల వినియోగంపై కీలక
లోక్సభలో వైసీపీకి.కేశినేని కౌంటర్


అమరావతి, 15 డిసెంబర్ (హి.స.)

లోక్‌సభలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సప్లిమెంటరీ డిమాండ్స్ ఫ‌ర్ గ్రాంట్స్‌పై ఎంపీ కేశినేని శివనాథ్ ప్రసంగించారు. అనుబంధ నిధుల కోసం 72 గ్రాంట్లపై జ‌రిగిన చర్చలో రూ. 1.32 లక్షల కోట్ల వినియోగంపై కీలక అంశాలను ఎంపీ వివరించారు. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ వైఖరిని లోక్‌సభలో ఎంపీ ఎండగట్టారు. వైసీపీ నాలుగేళ్ల‌లో 17 మెడిక‌ల్ కాలేజీలు నిర్మిస్తామ‌ని గొప్ప‌లు చెప్పి, ఒక‌టి కూడా ప్రారంభించ‌కుండా ప్ర‌జ‌లు, విద్యార్థుల‌ను మోసం చేసిందని విమర్శించారు. వైసీపీ పాలనలో వైద్యరంగం పూర్తిగా ప‌త‌న‌మైంద‌ని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande