
ఖమ్మం, 15 డిసెంబర్ (హి.స.)
మూడో విడత గ్రామ పంచాయతీ
ఎన్నికల్లో 63 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో పోలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, మద్యం, డబ్బులు, కానుకల పంపిణీపై ప్రత్యేక బృందాలు దృష్టి సారించాయన్నారు. పౌరులు సమన్వయం పాటించి నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు