
ములుగు, 15 డిసెంబర్ (హి.స.)
తుది విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్ స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తి చేసినట్లు తెలిపారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో మూడవ విడతలో ఎన్నికలు జరుగనున్న కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ సమక్షంలో కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ఈ ప్రక్రియను పూర్తి చేశామని, స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేయడం జరిగింది అని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు