
నల్గొండ, 15 డిసెంబర్ (హి.స.)
వివాహేతర సంబంధం పెట్టుకుని,
మద్యంలో విషం కలిపి భర్తను చంపిన భార్యకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడింది. నల్లగొండ జిల్లా ఎస్సీ/ఎస్టీ కేసుల కోర్టు-|| అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఎన్.రోజా రమణి సోమవారం ఉదయం మరో సంచలన తీర్పు వెళ్లడించారు. దేవరకొండ మండలంలోని పెద్దతండాకు చెందిన రమావత్ మోతీలాల్, భార్య లలితతో కలసి జీవించేవాడు. వీరికి 19 ఏండ్ల కుమారుడు, 22 ఏండ్ల కుమార్తె ఉన్నది. ఈ క్రమంలోనే లలిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో నివసించేది. 2025 డిసెంబర్ 29వ తేదీన హైదరాబాద్ నుంచి తనతో పాటు తెచ్చిన ఓ విషపధార్థాన్ని, మోతీలాల్ కు మద్యంలో కలిపి తాపించింది.
మరుసటి రోజు ఉదయం 10 గంటలైనా రాకపోవడంతో, తన అన్న శివరాం వచ్చి చూసే సరికి చనిపోయి ఉన్నాడు... లలితను గట్టిగా అడగడంతో నిజం ఒప్పకుంది. వెంటనే దేవరకొండ పోలీస్ స్టేషన్లో శివరాం ఫిర్యాదు చేయడంతో క్రైం నెంబర్ 379/2021, ఎస్సీ నెంబర్ 555/2022, యూ/ఎస్302 ఐపీసీ ప్రకారం కేసునమోదు చేసి అప్పటి సీఐ కే. బీసన్న దర్యాప్తు ప్రారంభించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు