
హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.)
న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు పోలీసులు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలను నిర్వహించే అన్ని హోటల్స్ యాజమాన్యాలు, ఈవెంట్ నిర్వహకులకు పోలీసులు పలు మార్గదర్శకాలను జారీ చేశారు. డిసెంబరు 31 రాత్రి ఒంటి గంట వరకు కొత్త సంవత్సరం స్వాగత వేడుకులను నిర్వహించేందుకు అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన హైదరాబాద్ పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం..
వేడుకలు జరిగే ప్రాంతంలో కచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో రికార్డింగ్ తప్పనిసరిగా ఉండాలి.
పార్కింగ్ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
15 రోజుల ముందే అనుమతుల కోసం దరఖాస్తు చేసుని పోలీసుల అనుమతి తీసుకోవాలి.
వేడుకల నిర్వాహకులు ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ప్రైవేటు సెక్యురిటీ గార్డ్స్ ను ఏర్పాటు చేసుకోవాలి.
వేడుకల వద్ద సెక్యురిటీని పటిష్టంగా పెట్టుకోవాలి.
అశ్లీలత ఉండొద్దు.
సౌండ్ సిస్టమ్ లకు రాత్రి 10 తర్వాత అనుమతి లేదు.
10 తర్వాత 45 డెసిబెల్స్ మించకుండా సౌండ్ ను వాడొచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు