కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినిలకు వేధింపులు.. రంగంలోకి ఎమ్మెల్యే రాజా సింగ్
తెలంగాణ, 15 డిసెంబర్ (హి.స.) కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో మేస్ ఇన్ఛార్జి తమను వేధిస్తున్నాడంటూ విద్యార్థినులు షీ టీమ్కు నేరుగా ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మేస్ ఇన్ఛార్జి ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటే భయంగా ఉందని పీజీ చదువుతున్న విద్యార్థి
ఎమ్మెల్యే రాజాసింగ్


తెలంగాణ, 15 డిసెంబర్ (హి.స.)

కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో

మేస్ ఇన్ఛార్జి తమను వేధిస్తున్నాడంటూ విద్యార్థినులు షీ టీమ్కు నేరుగా ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మేస్ ఇన్ఛార్జి ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటే భయంగా ఉందని పీజీ చదువుతున్న విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తాజాగా బయటకొచ్చిన విద్యార్థినుల ఆడియోలు వైరల్గా మారాయి. మేస్ ఇన్ఛార్జిపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాజీ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రంగంలోకి దిగారు. సోమవారం నేరుగా కోఠి మహిళా విశ్వవిద్యాలయంకి వెళ్లిన ఆయన.. మెస్ ఇన్ఛార్జ్ వేధింపుల ఘటనపై ఆరా తీశారు. అలాగే మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన యూనివర్సిటీ అధికారులకు సూచించారు.

ఇదిలా ఉంటే మెస్ ఇన్ఛార్జ్ వినోద్ కొంత మంది విద్యార్థినులను వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు రావడంతో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (వీసీ) ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే ఈ వేధింపుల ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం పలువురు కంప్లైంట్ చేయడంతో షీ టీమ్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande