మూడో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం.. సిద్దిపేట కలెక్టర్
సిద్దిపేట, 15 డిసెంబర్ (హి.స.) గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మూడో విడత పోలింగ్ అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హై
సిద్దిపేట కలెక్టర్


సిద్దిపేట, 15 డిసెంబర్ (హి.స.)

గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మూడో విడత పోలింగ్ అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి ఆధ్వర్యంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం చేపట్టారు. మూడో విడతలో అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దుల్మిట్ట, కొండపాక, కుకునూరు పల్లి మండలాల పరిధిలోని 163 గ్రామాల్లో 1,432 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇందుకోసం 1,718 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2,123 మంది అదనపు ప్రిసైడింగ్ అధికారులు కలిపి మొత్తం 3,841 మందిని 1,432 పోలింగ్ స్టేషన్లకు కేటాయిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande