సూర్యాపేట జిల్లా లో ఫ్లయింగ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు
సూర్యాపేట, 15 డిసెంబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా మండల కేంద్రం మీదుగా
ఫ్లయింగ్ స్క్వాడ్


సూర్యాపేట, 15 డిసెంబర్ (హి.స.)

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా మండల కేంద్రం మీదుగా వెళ్లే ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలతో పాటు ఇతర వాహనాలను నిలిపివేసి పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు.

ఎన్నికల సమయంలో వాహనాల ద్వారా నగదు, మద్యం తదితర ప్రలోభకర వస్తువుల అక్రమ రవాణా ఎన్నికల నిబంధనలకు విరుద్దమని, అలాంటి చర్యల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande