GHMC లో డివిజన్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.) హైదరాబాద్లో జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపును సవాల్ చేస్తూ వినయ్కుమార్ అనే వ్యక్తి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డివిజన్ల పునర్విభజన సమయంలో
హైకోర్టు


హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.)

హైదరాబాద్లో జీహెచ్ఎంసీ డివిజన్ల

సంఖ్య పెంపులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపును సవాల్ చేస్తూ వినయ్కుమార్ అనే వ్యక్తి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డివిజన్ల పునర్విభజన సమయంలో ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. తాను సమర్పించిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని ఆయన కోర్టును కోరగా.. జస్టిస్ బి. విజయ్సేన్రెడ్డి పిటిషన్ పై విచారణ చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande