
ఢిల్లీ, 15 డిసెంబర్ (హి.స.)
ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Mod) నేటి నుంచి నాలుగు రోజుల పాటు జోర్డాన్ (Jordan), ఇథియోపియా (Ethiopia), ఒమన్ (Oman) దేశాలకు అధికారికంగా పర్యటించనున్నారు. ఈ టూర్ డిసెంబర్ 18 వరకు కొనసాగనుంది. భారత్ యొక్క ‘లింక్ వెస్ట్ పాలసీ’, ఆఫ్రికా ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ పర్యటన జరుగనుంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, శక్తి రంగాల్లో సహకారాన్ని పెంచడం ప్రధాని టూర్ లక్ష్యాలని అధికారులు వెల్లడించారు.
జోర్డాన్ రాజు అబ్దుల్లా-II బిన్ అల్ హుస్సేన్ (Abdullah II bin Al Hussein) ఆహ్వానంపై మొదటగా ప్రధాని జోర్డాన్‌ను సందర్శించనున్నారు. భారత్-జోర్డాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ద్వైపాక్షిక చర్చలు జరిపి, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ భద్రత, శాంతి స్థిరత్వంపై అంశాలను చర్చించనున్నారు. అనంతరం ప్రధాని ఇండియా-జోర్డాన్ బిజినెస్ ఈవెంట్‌లో పాల్గొని వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు.
ఇక డిసెంబర్ 16 నుంచి 17 వరకు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీ (PM Abiy Ahmed Ali) ఆహ్వానంపై మొదటిసారి ఇథియోపియాలో ప్రధాని మోడీ పర్యటిస్తారు. దీంతో గ్లోబల్ సౌత్ భాగస్వాములుగా రెండు దేశాలు స్నేహం, సహకారాన్ని మరింత బలోపేతం కానున్నాయి. అభివృద్ధి సహకారం, వ్యవసాయం, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సామర్థ్య నిర్మాణం, భారతీయ వ్యాపారులకు పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరుగనున్నాయి.
డిసెంబర్ 17 నుంచి 18 వరకు సుల్తానేట్ ఆఫ్ ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ (Haitham bin Tariq) ఆహ్వానంపై చివరిగా ఒమన్‌కు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. రెండు దేశాల దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. వాణిజ్యం, పెట్టుబడులు, శక్తి, రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, సాంస్కృతిక రంగాల్లో సమగ్ర స్ట్రాటజిక్ భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చ జగనుంది. ముఖ్యంగా, భారత్-ఒమన్ మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ (CEPA) ఒప్పందంపై చర్చలు జరిగి, దానిని ప్రకటించే అవకాశం ఉంది. ఇది రెండు దేశాల వాణిజ్యాన్ని గణనీయంగా పెంచనుంద
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV