నేటినుంచి ఇథియోపియాలో ప్రధాని పర్యటన
ల్లీ 16,డిసెంబర్ (హి.స.) మూడు దేశాల పర్యటన కోసం సోమవారం ప్రధాని మోడీ జోర్డాన్ చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోడీకి జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఇక ఈరోజు ఇథియోపియా
pm-rajagopalachari-tribute


ల్లీ 16,డిసెంబర్ (హి.స.)

మూడు దేశాల పర్యటన కోసం సోమవారం ప్రధాని మోడీ జోర్డాన్ చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోడీకి జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు.

ఇక ఈరోజు ఇథియోపియాకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు ఇథియోపియాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇథియోపియాలో మోడీకి డిజిటల్ హోర్డింగ్‌లో స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం డిజిటల్ హోర్డింగుల్లో మోడీ ప్రత్యక్షమవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇథియోపియా పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఇథియోపియన్ ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ అలీతో మోడీ విస్తృత చర్చలు జరపనున్నారు. ఇక ఇథియోపియా పర్యటన తర్వాత మోడీ ఒమన్ దేశానికి వెళ్లనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande