
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్
ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు కేంద్రం మరో అప్ డేట్ ఇచ్చింది. పీఎఫ్ సొమ్మును ఏటీఎం, యూపీఐ ద్వారా విత్ డ్రా విషయంలో కొత్త డెడ్ లైన్ ప్రకటించింది. పీఎఫ్ నిధుల ఉప సంహరణ ప్రక్రియను సులభతరం చేయడంలో భాగంగా ఏటీఎం, యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం 2026 మార్చిలోపు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయా చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు